Friday, September 12, 2014

సరసాలు చాలు శ్రీవారు

చిత్రం : శివ (1989)
సంగీతం : ఇళయరాజా
నేపధ్య గానం : బాలు, జానకి  



పల్లవి :



సరసాలు చాలు శ్రీవారు.. వేళ కాదు
విరహాల గోల ఇంకానా.. వీలు కాదు
సరసాలు చాలు శ్రీవారు.. వేళ కాదు
విరహాల గోల ఇంకానా.. వీలు కాదు
వంటిట్లో గారాలు.. ఒళ్ళంతా కారాలే సారు


చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు


చరణం 1 :


సూర్యుడే చుర చుర చూసినా.. చీరనే వదలరు.. చీకటే చెరిగినా
కాకులే కేకలు వేసినా.. కౌగిలే వదలను.. వాకిలే పిలిచినా


స్నానానికే సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోపుగా కావాలనే సరదా
పాపిడి తీసి.. పౌడరు పూసి బైటికే పంపేయనా
పైటతో పాటే లోనికిరానా.. పాపలా పారాడనా
తియ్యగా తిడుతూనే.. లాలించనా


సరసాలు చాలు శ్రీవారు.. తాన నాన
విరహాల గోల ఇంకానా.. ఊహు ఊహు


చరణం 2 :


కొత్తగా కుదిరిన వేడుక.. మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందర.. బొత్తిగా కుదురుగా ఉండనే ఉండ
దా


ఆరారగా చేరక తీరేదెలా గొడవ
ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా
మోహమే తీరే మూర్తమే 
రాదా మోజులే చెల్లించవా

జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక
ఆగదే అందాక ఈడు గోల


చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
ఊరించే దూరాలు.. ఊ అంటే తియ్యంగా తీరు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు

లలలలలా.. అహహహహహా.హ్హాహాహహాహహహా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10763

No comments:

Post a Comment