Friday, September 12, 2014

బోటనీ పాఠముంది

చిత్రం : శివ (1989)
సంగీతం : ఇళయరాజా
నేపధ్య గానం : బాలు, ఎస్. పి. శైలజ 



పల్లవి :



బోటనీ పాఠముంది.. మేటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది.. మిస్టరీ పిక్చరుంది.. సోదరా ఏది బెస్టురా


బోటనీ క్లాసంటే బోరు బోరు
హిస్టరీ రోస్టు కన్న రెస్టు మేలు
పాటలూ ఫైటులున్న ఫిల్ము చూడూ
బ్రేకులూ డిస్కోలూ చూపుతారు


జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం



చరణం 1 :



దువ్వెనే కోడి జుట్టు.. నవ్వెనే ఏడ్చినట్టు.. ఎవ్వడే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు.. కన్నులే తేలబెట్టు.. ఎవ్వరీ వింత గరీబు


జోరుగా వచ్చాడే జేమ్సు బాండు
గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే జీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు


జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం 



చరణం 2 :



అయ్యో... మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే.. మార్గమే చెప్పు గురువా..


ఛీ.. ఛీ.. తాళం రాదు గాని మర్చి ట.. మార్చి
తాళంలో పాడరా వెధవా


మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే..  మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది.. ఏందిరో ఇంత గొడవా


ఎందుకీ హైరానా వెర్రి నాన్న
వెళ్ళరా సుళువైనా దారిలోనా...య్
ఉందిగా సెప్టెంబరు మార్చి పైనా
హొయ్ వాయిదా పద్దతుంది దేనికైనా



చరణం 3 :



మ్యాగ్జిమం మార్కులిచ్చు మ్యాథ్సులో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచరా..ఒరేయ్
తందనా తందననా తందనా తందనానా తందనా తందననన్నా


క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫు పై పెట్టు కాస్త ఫస్టు ర్యాంకు పొందవచ్చురోయ్..
తందనా తందననా తందనా తందనానా తందనా తందననన్నా


అరే ఏంది సార్..
లెక్కలూ ఎక్కాలూ తెల్వనోళ్ళు.. లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్త్కాల్తో కుస్తీలూ పట్టెటోళ్ళు.. సర్కారీ క్లర్కులై మురిగిపోతరు


జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10761

No comments:

Post a Comment