చిత్రం : సప్త స్వరాలు (1969)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
అదే నీవంటివి.. అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ అవునంటిని
అదే నీవంటివి.. అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన అవునంటిని
అదే నీవంటివి.. అదే నే వింటిని
చరణం 1 :
ఎవ్వరు లేని పువ్వుల తోట...
ఇద్దరు కోరే ముద్దుల మూట
ఆ........ ఆ....... ఆ....... ఆ........ ఆ
ఎవ్వరు లేని పువ్వుల తోట...
ఇద్దరు కోరే ముద్దుల మూట
ఎదలో కదలాడి పెదవుల తెరవీడి...
చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట
ఓ........ఓ.............ఓ.....
అదే నీవంటివి... అదే నే వింటిని...
చరణం 2 :
పున్నమి రేయి పూసిన చోట...
కన్నులు చేసే గారడి వేట
ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
పున్నమి రేయి పూసిన చోట...
కన్నులు చేసే గారడి వేట
చూపులు జత చేసి.... ఊపిరి శృతి చేసి
తనువే జిల్లన కల్పించిన ఆ మాట...ఓ...ఓ....
అదే నీ వంటివి అదే నే వింటిని....
చరణం 3 :
నిన్ను నన్ను కలిపిన బాట... నీలో నాలో పలికిన పాట
ఆ....ఆ...ఆ...ఆ...
నిన్ను నన్ను కలిపిన బాట... నీలో నాలో పలికిన పాట
జాబిలి చెక్కిలగా... కౌగిలి దగ్గరగా...
మనసే ఝల్లన చిలికించిన ఆ మాట...ఓ...ఓ...
అదే నీవంటివి అదే నే వింటిని
ఏమి అనలేని బిడియాన అవునంటిని
అదే నీవంటివి అదే నేవింటిని...
అహ...హ...అహ...హా...ఊహు...ఉహు...
No comments:
Post a Comment