Tuesday, September 23, 2014

అఖిలాండేశ్వరి ..చాముండేశ్వరి




చిత్రం :  సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల 


సాకీ :


ఓంకార పంజర శుకీమ్... ఉపనిషదుద్యాన కేళికల కంఠీమ్..
ఆగమ విపిన మయూరీ ... ఆర్యాం.. అంతర్విభావ యేత్ గౌరీమ్!!




పల్లవి :


అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి... 

పాలయమామ్ గౌరీ.. పరిపాలయమామ్... గౌరి

అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి...

పాలయమామ్ గౌరీ... పరిపాలయమామ్.. గౌరి



చరణం 1:



శుభగాత్రి గిరిరాజపుత్రి.. అభినేత్రి శర్వార్ధ గాత్రీ
ఆ...శుభగాత్రి గిరిరాజపుత్రి.. అభినేత్రి శర్వార్ధ గాత్రీ...



సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి.. చంద్రప్రభా ధవళకీర్తి..
సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి.. చంద్రప్రభా ధవళకీర్తి..



చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువనపాలిని
కుంకుమరాగశోభిని కుసుమ బాణ సంశోభిని
మౌనసుహాసిని... గానవినోదిని... భగవతి.. పార్వతి... దేవీ



అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి...

పాలయమామ్ గౌరీ... పరిపాలయమామ్ గౌరి 


చరణం 2:


శ్రీహరి ప్రణయాంబురాశి... 'శ్రీపాద విచలిత క్షీరాంబురాశి
శ్రీహరి ప్రణయాంబురాశి... శ్రీపాద విచలిత క్షీరాంబురాశి



శ్రీపీఠ సంవర్ధినీ... 
డోలాసురమర్ధిని

శ్రీపీఠ సంవర్ధినీ... డోలాసురమర్ధిని


ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి... ధైర్యలక్ష్మి... విజయలక్ష్మి
ధనలక్ష్మి... ధాన్యలక్ష్మి... ధైర్యలక్ష్మి... విజయలక్ష్మి
ఆదిలక్ష్మి... విద్యాలక్ష్మి... గజలక్ష్మి... సంతానలక్ష్మి
సకలభోగసౌభాగ్యలక్ష్మి... శ్రీమహాలక్ష్మి... దేవీ...


అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి... 

పాలయమామ్ గౌరీ... పరిపాలయమామ్ గౌరి 


చరణం 3 :


ఇందువదనే... కుందరదనే... వీణా పుస్తక ధారిణే
ఇందువదనే... కుందరదనే... వీణా పుస్తక ధారిణే


శుకశౌనకాది... వ్యాసవాల్మీకి... మునిజన పూజిత శుభచరణే
శుకశౌనకాది... వ్యాసవాల్మీకి... మునిజన పూజిత శుభచరణే...


సరస సాహిత్య... స్వరస సంగీత... స్తనయుగళే
సరస సాహిత్య... స్వరస సంగీత... స్తనయుగళే
వరదే అక్షరరూపిణే... శారదే దేవీ


అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి.. 

పాలయమామ్ గౌరీ... పరిపాలయమామ్ గౌరి 



చరణం 4 :


వింధ్యాటవీ వాసినే... యోగసంధ్యాసముద్భాసినే
సింహాసనస్థాయినే... దుష్టహరరంహక్రియాశాలినే


విష్ణుప్రియే... సర్వలోకప్రియే... సర్వనామప్రియే... ధర్మసమరప్రియే..
హే... బ్రహ్మచారిణే... దుష్కర్మవారిణే..
హే... విలంబితకేశపాశినే....
మహిషమర్దనశీల... మహితగర్జనలోల..
భయద నర్తన కేళికే... కాళికే..
దుర్గమాగమదుర్గ వాసినే దుర్గే దేవీ...




4 comments:

  1. Wonderfully created page thanks for the lyrics my humble pranamams to the person who created in a wonderful way 🙂🙂🙂👍🙏🙏🙏🙏

    ReplyDelete
  2. tq very much 🙏🏻
    ever green song on maaa

    ReplyDelete
  3. https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8365
    Is not working

    ReplyDelete
  4. http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7524
    Is also not working please clarify how we can play MP3 song in site

    ReplyDelete