చిత్రం : సంతానం (1955)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత : అనిశెట్టి
నేపధ్య గానం : లతా మంగేష్కర్
పల్లవి :
ఊఁ.....ఊఁ....నిదురపో..నిదురపో..
నిదురపో...నిదురపో...నిదురపో..నిదురపో...
నిదురపోరా.. తమ్ముడా.. నిదురపోరా.. తమ్ముడా..
నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా
నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా..
నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...
చరణం 1 :
కలలు పండే కాలమంతా కనులముందే కదలిపోయే ఆ..ఆ....
కలలుపండే కాలమంతా.. కనులముందే కదిలిపోయె
లేతమనసున.. చిగురుటాశ.. పూతలోనే.. రాలిపోయే..
నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...
చరణం 2 :
ఆఁ....ఆఁ....ఆఁ....ఆఁ
జాలితలచి.. కన్నీరు తుడిచే.. దాతలే కనరారే..
ఏ..ఏ.. జాలితలచి కన్నీరు తుడిచే దాతలే..కనరారే..
చితికిపోయినా జీవితమంతా చింతలో చితి ఆయే
నీడ చూపే నెలవు మనకూ నిదురయేరా తమ్ముడా
నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...నిదురపోరా.. తమ్ముడా...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1015
No comments:
Post a Comment