Monday, September 22, 2014

చల్లని వెన్నెలలో

చిత్రం :  సంతానం (1955)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత :  అనిశెట్టి
నేపధ్య గానం :  ఘంటసాల  

పల్లవి :

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

చల్లని వెన్నెలలో ... చల్లని వెన్నెలలో...ఓ..ఓ..ఓ..
చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో ...ఓ..ఓ..
చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో ...
అందమే నాలో లీనమాయెనే...ఆనందమే నా గానమాయెనే..
చల్లని వెన్నెలలో... 

చరణం 1 :

తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
గాలి పెదవులే మెల్లగ సోకిన ... గాలి పెదవులే మెల్లగ సోకిన...
పూలు నవ్వెనే నిద్దురలో....  

చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో ...
అందమే నాలో లీనమాయెనే...ఆనందమే నా గానమాయెనే..
చల్లని వెన్నెలలో... 

చరణం 2 :

కలకలలాడే కన్నె వదనమే కనిపింతును ఆ తారలలో..ఓ
కలకలలాడే కన్నె వదనమే కనిపింతును ఆ తారలలో...
కలకాలము నీ కమ్మని రూపము ... కలకాలము నీ కమ్మని రూపము
కలవరింతులే నా మదిలో...ఓ..ఓ.. 

చల్లని వెన్నెలలో.. చక్కని కన్నె సమీపములో ...
అందమే నాలో లీనమాయెనే... ఆనందమే నా గానమాయెనే..
చల్లని వెన్నెలలో... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1010

No comments:

Post a Comment