Sunday, September 21, 2014

మనసున మొలిచిన సరిగమలే

చిత్రం :  సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు, జానకి

పల్లవి :

మనసున మొలిచిన సరిగమలే
ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నినుచేరి
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై ...పరుగున రా
ఎద సడితో నటియించగ రా...
స్వాగతం సుస్వాగతం .. స్వాగతం సుస్వాగతం

కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జత చేసి
కుకుకూ కుకుక్కూ కీర్తన ... తొలి ఆమనివై రా...
పిలిచే చిలిపి కోయిలా ... ఎట దాగున్నావో ..

కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జత చేసి..

మీ నృత్యం చూసి నిజంగా... ఊ నిజంగా .. ఉ.... 

చరణం 1 :

మువ్వల రవళి పిలిచింది .. కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది .. మనసు కలను వెతికింది
వయ్యారాల గౌతమి... వయ్యారాల గౌతమి...
ఈ కన్యా రూప కల్పన....
వసంతాల గీతినే నన్నే మేలుకొల్పిన
భావాల పూల రాగాల బాట నీకై వేచేనే ...

కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
ఇది నా మది సంకీర్తన .. కుకుకూ కుకుక్కూ
సుధలూరే ఆలాపాన .. కుకుకూ కుకుక్కూ

ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ 

చరణం 2 :

లలిత లలిత పదబంధం ... మదిని మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం .. అవని అధర దరహాసం
మరందాల గానమే ... మరందాల గానమే... మృదంగాల 
నాదము..

ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము...
మేఘాల దారి ఊరేగు ఊహ... వాలే ఈ మ్రోల

కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
ఇది నా మది సంకీర్తన .. కుకుకూ కుకుక్కూ
సుధలూరే ఆలాపాన .. కుకుకూ కుకుక్కూ

రారా స్వరముల సోపానములకు పాదాలను జత చేసి..
కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ చుకు చుకు కూకూ 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10503

No comments:

Post a Comment