Sunday, September 21, 2014

ఏ నావదే తీరమో

చిత్రం :  సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత  :  సిరివెన్నెల
నేపధ్య గానం: ఏసుదాస్



పల్లవి :



ఏ..ఏ...ఏహే...ఓ....ఓ...ఓ...ఓ....
ఓ...ఓ...ఓ...ఓ...ఓ...


ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
కలగానో...ఓ..ఓ... కథగానో.... ఓ.. ఓ..
మిగిలేది నీవే... ఈ జన్మలో... ఓ...
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో



చరణం 1 :


నాలోని నీవే నేనైనానో.... నీలోని నేనే నీవైనావో
నాలోని నీవే నేనైనానో.... నీలోని నేనే నీవైనావో


విన్నావా ఈ వింతను.... అన్నారా ఎవరైనను
విన్నావా ఈ వింతను.... అన్నారా ఎవరైనను
నీకు నాకే చెల్లిందను... ఉ.. ఉ...


ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో



చరణం 2 :


ఆకాశమల్లె నీవున్నావు.... నీ నీలి రంగై నేనున్నాను
ఆకాశమల్లె నీవున్నావు.... నీ నీలి రంగై నేనున్నాను


కలిసేది ఊహేనను.... ఊహల్లో కలిసామను...
కలిసేది ఊహేనను.... ఊహల్లో కలిసామను...
నీవు... నేనే... సాక్షాలను...


ఏ నావదే తీరమో.... ఏ నేస్తమే జన్మవరమో
కలగానో... ఓ... కథగానో.... ఓ...
మిగిలేది నీవే ఈ జన్మలో...
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో
ఏ నావదే తీరమో... ఏ నేస్తమే జన్మవరమో




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10504

No comments:

Post a Comment