Monday, September 22, 2014

నిద్దురపోరా ఓ వయసా

చిత్రం :  సంఘర్షణ (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి  



పల్లవి :



లలలలలలా.. లలలలలలా


నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఊపను ఉయ్యాల.. ఎంతని ఊపను ఉయ్యాల
ఏమని పాడను ముద్దుల జోలా...


జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ


నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
ఎంతని ఓపను నీ గోల.. ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను వెచ్చని జోలా..


జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ 


చరణం 1 :


మసకైనా పడనీవూ.. మల్లె విచ్చుకోనీవూ.. హవ్వ హవ్వ హవ్వా..
మాటు మణిగిపోనీవూ.. చాటు చూసుకోనీవూ.. హవ్వ హవ్వ హవ్వా..


వేళాపాళా లేదాయే.. పాలకి ఒకటే గోలాయే
చెపితేనేమో వినవాయే.. చెప్పకపోతే గొడవాయే
బజ్జోమంటే తంటాలా.. ఎప్పుడు పడితే అపుడేనా


జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ 



చరణం 2 :



మనసైనా పడనీవూ మాట చెప్పుకోనీవూ... హవ్వ హవ్వ హవ్వా..
లాల పోసుకోనీవూ పూలు ముడుచుకోనీవూ... హవ్వ హవ్వ హవ్వా..


వెండీ గిన్నె తేవాయే...  వెన్నెలబువ్వే కరువాయే
చలిగాలేస్తే సలుపాయే...  వెచ్చని గాలికి వలపాయే
తాకంగానే తాపాలా... ఆనక అంటే అల్లరేనా


జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ


నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ
నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ


ఎంతని ఊపను ఉయ్యాల.. ఎంతని ఓపను నీ గోల
ఏమని పాడను ముద్దుల జోలా...


జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9337

No comments:

Post a Comment