చిత్రం : సంఘర్షణ (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
కట్టు జారి పోతా ఉందీ.. చీర కట్టు జారి పోతా ఉందీ హోయ్..
బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ..హోయ్
ఒట్టమ్మో ఒళ్లంతా ఉలికి ఉలికి పడతా ఉందీ..
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ...
అరే...కట్టు జారి పోతా ఉందా... హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా.. హా
బొట్టు కారి పోతా ఉందా... హోయ్
చుక్క బొట్టు కారి పొతా ఉందా... హా
ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా.. హా
ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా...
కట్టు జారి పోతా ఉందీ... చీర కట్టు జారి పోతా ఉందీ
చరణం 1 :
మొగ్గమ్మ చూసింది.. పువ్వమ్మ నవ్వింది
మొగ్గమ్మ చూసింది.. పువ్వమ్మ నవ్వింది
గోరంతా ఈ గొడవ ఊరంతా చెప్పిందమ్మ
పరువంతా తీసిందమ్మా...
సోకమ్మ తాకింది.. కోకమ్మ తరిగింది
సోకమ్మ తాకింది.. కోకమ్మ తరిగింది
కాకమ్మ ఆ కబురు కథలాగా చెప్పిందమ్మా..ఆ... ఆ
కలలెన్నో రేపిందమ్మా...
చీరకట్టలేని చిన్నదానికింక సారె పెట్టనేల చిన్నోడు
పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు
పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు
బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ..
చరణం 2 :
పిట్టమ్మ చూసిందీ.. చెట్టెక్కి కూసిందీ..
పిట్టమ్మ చూసిందీ.. చెట్టెక్కి కూసిందీ..
బిడియాల కడకొంగు ముడి పెట్టుకోమందమ్మా
ముద్దెట్టుకోమందమ్మా...
సిగ్గమ్మ వచ్చింది.. శెలవంటు వెళ్ళింది ..
సిగ్గమ్మ వచ్చింది ...శెలవంటు వెళ్ళింది
ఒక నాటి చెలికాడి ఒడి చేరుకోమందమ్మా... ఒదిగొదిగి పొమ్మందమ్మా...
పుట్టగానే చెయ్యి పట్టుకున్న ప్రేమ పూతకొచ్చెనమ్మ ఈనాడు
చిన్నవాడి కళ్ళు.. చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు...
చిన్నవాడి కళ్ళు.. చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు
అరే...కట్టు జారి పోతా ఉందా...హోయ్
చీర కట్టు జారి పోతా ఉందా..హ హా
బొట్టు కారి పోతా ఉందీ..
చుక్క బొట్టు కారి పోతా ఉందీ..
ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా.. హ హ హ హ హా
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ...
కట్టు జారి పోతా ఉందీ... చీర కట్టు జారి పోతా ఉందీ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9336
No comments:
Post a Comment