చిత్రం : శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..
ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..
ముసుగులో పువ్వులు రెండు...
ముసుగులో పువ్వులు రెండు...
ఆడుకుంటున్నాయి... పాడుకుంటున్నాయి...
ఆడి పాడి కిందా మీదా... పడిపోతున్నాయి..
హా..హా..హా..హ...
హా... ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..
చరణం 1 :
తొలకరి జల్లుల చినుకులలో... హా...
గడసరి చినుకుల తాకిడిలో... హా..
మగసిరి గాలుల సైగలలో... హా..
ఊపిరి సలపని కౌగిలిలో... హా...
చెట్టాపట్టాలెసుకొని.. చెట్టుల చాటుకు వస్తే..
పిట్టలు కూతలు కూస్తే.. తలపై పువ్వులు పడితే...
పిట్టలు కూతలు కూస్తే.. తలపై పువ్వులు పడితే...
మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?.. బాజాలెందుకు? భజంత్రీలెందుకు?
హా... ఎందుకు?
హోయ్... హోయ్.. ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..
చరణం 2 :
చిరుచిరు నవ్వుల పెదవులపై.. హా...
కురిసి కురవని ముద్దులలో.. హా...
చిరు చిరు చెమటల బుగ్గలపై... హా..
తెలిసి తెలియని సిగ్గులలో... హా..
బుగ్గా బుగ్గ కలుసుకొని.. సిగ్గుల పానుపులేస్తే...
పెదవి పెదవి కలుసుకొని.. ముద్దుల రాగం తీస్తే...
పెదవి పెదవి కలుసుకొని.. ముద్దుల రాగం తీస్తే...
మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?.. బాజాలెందుకు? భజంత్రీలెందుకు?
ఛా... ఎందుకు?
ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..
ఆ... ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..
ముసుగులో పువ్వులు రెండు...
ముసుగులో పువ్వులు రెండు...
ఆడుకుంటున్నాయి.. పాడుకుంటున్నాయి...
ఆడి పాడి కిందా మీదా పడిపోతున్నాయి..
హోయ్..ఆకాశం ముసిరేసింది... హా.. ఊరంతా ముసుగేసింది..
ఆ.. ఆకాశం ముసిరేసింది... ఆ.. ఊరంతా ముసుగేసింది..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1862
No comments:
Post a Comment