చిత్రం : శ్రీవారి శోభనం (1984)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి
పల్లవి :
అలక పానుపు ఎక్కనేల.. చిలిపి గోరింకా...
ఆ... ఆ.. ఆ... అలక చాలింక
'నాకలకేమిటే నీ మొహం ఊరుకో'
అలక పానుపు ఎక్కనేల.. చిలిపి గోరింకా
ఆ.. ఆ.. ఆ... అలక చాలింక
శీతాకాలం సాయంకాలం....
శీతాకాలం సాయంకాలం....
అటు అలిగిపోయేవేల? చలి కొరికి చంపే వేళా
అందుకే లోపలికి పోతానే తల్లీ.. నన్నొదులు
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా
ఆ.. ఆ.. ఆ... అలక చాలింకా
చరణం 1 :
రామ..రామ! శబరి బామ్మ నిద్దరే పోదూ
'హ్మ్ నువ్విట్టా ఇంత గొంతేసుకుని పాడితే నిద్దరెట్టా పడుతుందే'
రాతిరంతా చందమామ నిదర పోనీదు.. ఊ..
కంటి కబురా పంపలేనూ..
ఇంటి గడపా దాటలేనూ..
ఆ దోర నవ్వూ దాచకే.. నా నేరమింకా ఎంచకే
ఆ దోర నవ్వూ దాచకే.. ఈ నవ్వు నవ్వీ చంపకే
అలక పానుపు ఎక్కనేల.. చిలిపి గోరింకా
ఆ.. ఆ... ఆ... అలక చాలింకా
చరణం 2 :
రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరూ
రాయని ఆ నుదిటిరాత రాయనూలేరూ
'ఆ రాతే రాసి ఉంటే ఇంట్లోనే వెచ్చగా నిద్రపోయేదాన్ని కదా'
రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరూ
రాయని ఆ నుదిటిరాత రాయనూలేరూ
నచ్చినా మహరాజు నీవూ...
నచ్చితే మహరాణి నేనూ...
ఆ మాట ఏదో తెలిపితే మీ నోటి ముత్యం రాలునా
నులకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా
ఆ.. ఆ.. ఆ... అల్లరాపమ్మా...
శీతాకాలం సాయంకాలం....
శీతాకాలం సాయంకాలం....
నను చంపకే తల్లీ.. జోకొట్టకే గిల్లీ
అలక పానుపు ఎక్కనేల.. చిలిపి గోరింకా
ఆ.. ఆ.. ఆ... అలక చాలింకా...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6016
No comments:
Post a Comment