Friday, September 19, 2014

సూర్యునికొకటే ఉదయం

చిత్రం :  శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  బాలు, సుశీల  
  



పల్లవి :



సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం


ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
 


చరణం 1 : 


చీకటి పోకకు.. వెలుతురు రాకకు.. వారధి... ఆ ఉదయంప్రేమ పోకకు త్యాగం రాకకు .. సారధి... ఈ హృదయం

చీకటి పోకకు.. వెలుతురు రాకకు.. వారధి ఆ ఉదయంప్రేమ పోకకు త్యాగం రాకకు .. సారధి ఈ హృదయం

అది వెలిగే ఉదయం.. ఇది కరిగే హృదయం


ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో
సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం



చరణం 2  : 


జాబిలి విరిసినా.. భానుడు వెలిసినా.. ఒకటే ఆకాశం
కలలు తీరినా.. కథలు చెరిగినా.. ఒకటే అనురాగం... 


జాబిలి విరిసినా.. భానుడు వెలిసినా.. ఒకటే ఆకాశం
కలలు తీరినా.. కథలు చెరిగినా.. ఒకటే అనురాగం...


అది మారని ఆకాశం... ఇది మాయని అనురాగం..
ఆకాశం ఎందరిదో.. అనురాగం ఎవ్వరిదో...

సూర్యునికొకటే ఉదయం.. మనిషికి ఒకటే హృదయం
ఆ ఉదయం ఎందరిదో.. ఈ హృదయం ఎవ్వరిదో



No comments:

Post a Comment