Friday, September 19, 2014

ముక్కుపచ్చలారని కాశ్మీరం

చిత్రం :  శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  బాలు, సుశీల      
 



పల్లవి :


ముక్కుపచ్చలారని కాశ్మీరం..  ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
ఆ.. ముక్కుపచ్చలారని కాశ్మీరం..  ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం... దీని యవ్వారం కాశ్మీరం
దీన్ని ఒల్లంతా కాశ్మీరం... దీన్ని చూస్తే కాశ్మీరం..
రామ్.. రామ్.. రామ్.. రామ్


ముక్కుపచ్చలారని కాశ్మీరం.. ఆ.. మూడుముళ్ళకొచ్చింది  కాశ్మీరం
ముక్కుపచ్చలారని కాశ్మీరం..  మూడుముళ్ళకొచ్చింది  కాశ్మీరం
వీడి మనసంతా కాశ్మీరం... వీడి చూపులన్ని మాటలన్ని  కాశ్మీరం..
వీడి మాటలన్ని  కాశ్మీరం... వీణ్ణి  చూస్తే కాశ్మీరం...
రామ్.. రామ్.. రామ్..  రామ్ 


చరణం 1 :


మొదటి సారి చూసుకుంటే ఊరింతలు.. ఆపై కలుసుకుంటే ఉడికింతలు..
మొదటి సారి చూసుకుంటే ఊరింతలు.. ఆపై కలుసుకుంటే ఉడికింతలు.. 


కలిసి తిరుగుతుంటే... గిలిగింతలు
పెళ్ళిదాక వస్తే... అప్పగింతలు..
మనసు విప్పి కప్పుకుంటే.. అసలైన సిసలైన కేరింతలు...



ముక్కుపచ్చలారని కాశ్మీరం..  ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం
ముక్కుపచ్చలారని కాశ్మీరం..  ముక్కుపుడకతో వచ్చింది కాశ్మీరం


చరణం 2 :


కళ్ళు కళ్ళు చూసుకుంటే.. చెలగాటము...
చెయ్యి చెయ్యి పట్టుకుంటే.. ఉబలాటము...
కాలు కాలు ముట్టుకుంటే.. బులపాటము...
బుగ్గ బుగ్గ రాసుకుంటే.. ఇరకాటము...
మనసు విప్పి కప్పుకుంటే అసలైన సిసలైన ఆరాటము...



ముక్కుపచ్చలారని కాశ్మీరం.. హా.. మూడుముళ్ళకొచ్చింది  కాశ్మీరం
దీని వయ్యారం కాశ్మీరం.. వీడి చూపులన్ని మాటలన్ని  కాశ్మీరం
దీన్ని ఒల్లంతా కాశ్మీరం.. వీణ్ణి  చూస్తే కాశ్మీరం...
రామ్.. రామ్.. రామ్..  రామ్..
ముక్కుపచ్చలారని కాశ్మీరం... హహహా.. మూడుముళ్ళకొచ్చింది  కాశ్మీరం


No comments:

Post a Comment