Tuesday, September 23, 2014

గోవుల్లు తెల్లన




చిత్రం :  సప్తపది (1981)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి 


పల్లవి :


గోవుల్లు తెల్లన... గోపయ్య నల్లనా... 
గోధూళి ఎర్రనా... ఎందువలనా...
గోవుల్లు తెల్లన... గోపయ్య నల్లనా...
గోధూళి ఎర్రనా... ఎందువలనా...
గోధూళి ఎర్రనా ఎందువలనా...
 


చరణం 1 :


తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా... ఎందుకుండవ్
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా...  ఏమో


తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా
కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా
ఆ పొద్దు పొడిచేనా.... ఈ పొద్దు గడిచేనా....
ఎందువలనా అంటే అందువలనా
ఎందువలనా అంటే దైవఘటనా


గోవుల్లు తెల్లన... గోపయ్య నల్లనా
గోధూళి ఎర్రనా... ఎందువలనా
హొయ్ ఒయ్ గోధూళి ఎర్రనా ఎందువలనా
 


చరణం 2 :


పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ... పాపం
అల్లన మోవికీ తాకితే గేయాలూ... హా హా హా...
పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ
అల్లన మోవికీ తాకితే గేయాలూ


ఆ మురళి మూగైనా... ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో... ఈ పాట నిండదా
ఈ కడిమీ పూసేనా... ఆ కలిమీ చూసేనా....


ఎందువలనా అంటే అందువలనా
ఎందువలనా అంటే దైవఘటనా
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా
గోధూళి ఎల్లనా ఎందువలనా
గోధూళి ఎర్రనా ఎందువలనా
లలాల లాలలా లల్లల... 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7525

No comments:

Post a Comment