Tuesday, September 23, 2014

నెమలికి నేర్పిన నడకలివి

చిత్రం :  సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  జానకి 

పల్లవి :

నెమలికి నేర్పిన నడకలివీ...
మురళికి అందని పలుకులివి..
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడాలి నా నాట్యలీల....
 
నెమలికి నేర్పిన నడకలివీ...
మురళికి అందని పలుకులివి..
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడాలి నా నాట్యలీల....

నెమలికి నేర్పిన... అ...

నెమలికి నేర్పిన నడకలివి..

చరణం 1 :

కలహంసలకిచ్చిన పదగతులు... ఎలకోయిల మెచ్చిన స్వరజతులు
కలహంసలకిచ్చిన పదగతులు... ఎలకోయిల మెచ్చిన స్వరజతులు

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు... ఏవేవో కన్నుల కిన్నెరలు
ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు... ఏవేవో కన్నుల కిన్నెరలు

కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు 

కమనీయ కల్పనానల్ప శిల్ప మణి మేఖలను... 

శకుంతలను.... 

ఓ..ఓ..ఓ. నెమలికి నేర్పిన నడకలివి

చరణం 2 :

చిరునవ్వులు అభినవ మల్లికలు... సిరిమువ్వలు అభినయ దీపికలు
చిరునవ్వులు అభినవ మల్లికలు... సిరిమువ్వలు అభినయ దీపికలు

నీలాల కన్నుల్లో తారకలు... తారాడే చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు... తారాడే చూపుల్లో చంద్రికలు

కురులు విరిసి... మరులు కురిసి  మురిసిన 

రవివర్మ చిత్రలేఖనా లేఖ్య సరస సౌందర్య రేఖను...

శశిరేఖను.... 

నెమలికి నేర్పిన నడకలివి..
మురళికి అందని పలుకులివి..
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడాలి నా నాట్యలీల....

నెమలికి నేర్పిన నడకలివి..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7521

No comments:

Post a Comment