Friday, September 19, 2014

అనురాగ రాశి.. ఊర్వశి

చిత్రం :  శభాష్ పాపన్న  (1972)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత  :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల  



పల్లవి :


అనురాగ రాశి.. ఊర్వశి
నా ఆనంద  సరసి..  ప్రేయసి
నా ఆనంద  సరసి.. ప్రేయసి


మనసార వలచే మన్మధ..
నా కనులందు వెలిగే దేవతా
నా కనులందు వెలిగే దేవతా


చరణం 1 :


మనసే పూచిన మధువనమైతే..  మమతే కమ్మని తావి సుమా.. 

ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ


మనసే పూచిన మధువనమైతే.. మమతే కమ్మని తావి సుమా
తనువే పొంగి తరంగమైతే..
తనువే పొంగి తరంగమైతే.. తలపే నురగల జిలుగు సుమా..

మనసార వలచే మన్మధ.. నా కనులందు వెలిగే దేవతా



చరణం 2 :


వయసే మంజుల వేణువు అయితే.. హొయలే మోహన గీతి సుమా
ఆ..... ఆ..... ఆ..... ఆ...... ఆ..... ఆ...... ఆ..
వయసే మంజుల వేణువు అయితే.. హొయలే మోహన గీతి సుమా


సొగసులు కర్పుర శిలలే అయితే
సొగసులు కర్పుర శిలలే అయితే... వగలే అరని జ్యోతి సుమా.. 

అనురాగ రాశి.. ఊర్వశి ... నా ఆనంద  సరసి..  ప్రేయసి


చరణం 3 :


మేఘము నీవై.. మెరుపును నేనై.. మృదుమాధుర్యం కురవాలి
రాగము నీవై...  రాగిణి నీవై...  రసవాహిణిగా సాగాలి 



మనసార వలచే మన్మధ.. నా కనులందు వెలిగే దేవతా
నా కనులందు వెలిగే దేవతా


No comments:

Post a Comment