Sunday, September 21, 2014

సాయీ శరణం బాబా శరణం

చిత్రం :  శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఏసుదాస్  



పల్లవి :


హే పాండురంగా! హే పండరినాథా!
శరణం.. శరణం... శరణం


సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే


సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం 


చరణం 1 :


విద్యాబుద్ధులూ వేడినబాలకూ అగుపించాడూ విఘ్నేశ్వరుడై
పిల్లాపాపలా కోరినవారినీ కరుణించాడూ సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధినీ అరికట్టాడూ విష్ణురూపుడై
మహల్సా శ్యామాకూ మారుతిగానూ మరికొందరికీ దత్తాత్రేయుడుగా
యధ్బావం తధ్భవతని దర్శనమిచ్చాడు ధన్యులజేశాడు


సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
 


చరణం 2 :


పెనుతుఫాను తాకిడిలో అలమటించు దీనులనూ ఆదరించె ప్రాణనాధ నాధుడై
అజ్ఞానము అలముకొన్న అంధులనూ చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తీ వారి వారి పాపములనూ పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకొన్న పాపములనూ పక్షాళన చేసికొనెను దౌత్యక్రియ సిధ్ధితో శుధ్ధుడై
అంగములను వేరుచేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిధ్ధుడై
జీవరాశులన్నిటికి సాయే శరణం... సాయే శరణం
దివ్యజ్ఞానసాధనకూ సాయే శరణం... సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం... నాస్తికులకూ సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం ...నాస్తికులకూ సాయే శరణం
భక్తికీ సాయే శరణం... ముక్తికీ సాయే శరణం
భక్తికీ సాయే శరణం... ముక్తికీ సాయే శరణం



సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయే
మా పాండురంగడు కరుణామయుడు సాయే
సాయీ శరణం బాబా శరణం శరణం
సాయీ చరణం గంగా యమున సంగమ సమానం



No comments:

Post a Comment