Thursday, September 25, 2014

సన్నాయి రాగానికి

చిత్రం :  సన్నాయి అప్పన్న (1980)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  బాలు, సుశీల

పల్లవి : 

సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి..
సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి..
ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా.. 

చరణం 1 :

ఏ మువ్వ ఎదలో మ్రోగి.. ఏ నవ్వు చెలరేగి..
ఏ ఓర చూపు దూసి... ఏ రూపు నిలవేసి
ఏ ఓర చూపు దూసి... ఏ రూపు నిలవేసి..

చిలిపిగా.. చెలిమిగా...
వలపుగా.. వరముగా...
హృదయాలు కలబోసెనో...

సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి..
ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా.. 

చరణం 2 :

ఏ స్వరము నీలో మెదిలి.. నా పదము పలికిందో..
ఏ సొగసు నీలో మెరిసి.. నా శ్రుతిని తెలిపిందో..

జతులుగా... కళలుగా...
లయలుగా... హొయలుగా...
స్వర్గాలు తెరిపించెనో...

సన్నాయి రాగానికి.. ఈ చిన్నారి నాట్యానికి..
ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా..
ఒకే తాళమైనది.. ఈడు జోడుగా.. తోడు నీడగా.. 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2659

2 comments: