Thursday, September 25, 2014

ఆది భిక్షువు వాడినేది కోరేది

చిత్రం :  సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు 


పల్లవి : 


ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఆది భిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది


ఏది కోరేది.. వాడినేది అడిగేది
ఏది కోరేది.. వాడినేది అడిగేది 


చరణం 1 : 


తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది

తీపి రాగాల కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది

కరకు గర్జనల మేఘముల మేనికి.. మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది

ఏది కోరేది వాడినేది అడిగేది.. ఏది కోరేది వాడినేది అడిగేది 


చరణం 2 : 


తేనెలొలికే పూల బాలలకు.. మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు.. మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాల్లను చిరాయువగ జీవించమని ఆనతిచ్చిన వడినేది అడిగేది

ఏది కోరేది వాడినేది అడిగేది... ఏది కోరేది వాడినేది అడిగేది


చరణం 3 : 


గిరిబాలతో తనకు కల్యాణ మొనరింప దరిజేరు
మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు
ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది


ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి.. ముక్కోపి.. ముక్కంటి.. ముక్కోపి... తిక్క శంకరుడు


ఆది భిక్షువు వాడినేది కోరేది..
బూడిదిచ్చే వాడినేది అడిగేది


ఏది కోరేది.. వాడినేది అడిగేది
ఏది కోరేది.. వాడినేది అడిగేది 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12044

No comments:

Post a Comment