Wednesday, September 10, 2014

రాగం తానం పల్లవి

చిత్రం :  శంకరాభరణం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు  



పల్లవి :


రాగం తానం పల్లవి..రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి..రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి


రాగం తానం పల్లవి 



చరణం 1 :


నాద వర్తులై వేద మూర్తులై..నాద వర్తులై వేద మూర్తులై
రాగ కీర్తులై త్రిమూర్తులై
రాగం తానం పల్లవి



చరణం 2 :


కృష్ణా తరంగాల సారంగ రాగాలు
కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
కృష్ణా తరంగాల సారంగ రాగాలు
కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు


సస్యకేదారాల స్వరస గాంధారాలు
సస్యకేదారాల స్వరస గాంధారాలు


సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
క్షీర సాగర శయన దేవ గాంధారిలో..
ఆ..ఆ..ఆ..ఆ.
క్షీర సాగర శయన దేవ గాంధారిలో
నీ పద కీర్తన సేయగ ప మా ప ద ని
రాగం తానం పల్లవి


చరణం 3 :


శ్రుతిలయలే జననీ జనకులు కాగా
భావాల రాగాల తాళాల తేలి
శ్రుతిలయలే జననీ జనకులు కాగా
భావాల రాగాల తాళాల తేలి


శ్రీ చరణ మందార మధుపమ్మునై వాలి
శ్రీ చరణ మందార మధుపమ్మునై వాలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
భరతాభినయవేద ఆ ఆ... ఆ...
ఆ.. ఆ.. ఆ.. అ
భరతాభినయవేద వ్రత దీక్షబూని


కైలాస సదన కాంభోజి రాగాన
కైలాస సదన కాంభోజి రాగాన
నీ పద నర్తన సేయగ ప దా ని
రాగం తానం పల్లవి




No comments:

Post a Comment