Friday, September 12, 2014

అభినవ తారవో

చిత్రం :  శివరంజని (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : బాలుపల్లవి :అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో..

 అభినయన రసమయ కాంతిధారవో

అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర సింజాల సుమశ
ర శింజిని శివరంజనీ ... శివరంజనీ 


చరణం 1 :


అది దరహాసమా .. మరి మధుమాసమా

అది దరహాసమా .. మరి మధుమాసమా

ఆ మరునికి దొరికిన అవకాశమా

అవి చరణమ్ములా ? శశికిరణంబులా ?

అవి చరణమ్ములా ? శశికిరణంబులా ?


నా తరుణ భావనా హరినమ్ములా 

అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో.. 
శివరంజనీ ... శివరంజనీ


చరణం 2 :


ఆ నయనాలు విరిసిన చాలు.. అమావస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసిన చాలు.. అమావస నిశిలో చంద్రోదయాలు
ఆ నెనడుము ఆడిన చాలు ...
ఆ నెనడుము ఆడిన చాలు.. రవళించును పదకవితా ప్రభందాలు

అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో.. 
శివరంజనీ ... శివరంజనీ


చరణం 3 : నీ శృంగార లలిత భంగిమలో.. పొంగిపోదురే ఋషులైనా
నీ కరుణరసావిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైనా
వీరమా ... నీ కుపిత నేత్ర సంచారమే..
హాస్యమా .... నీకది చిటికలోన వశ్యమే

నవరస పోషణ చణవనీ
నటనాంకిత జీవనివనీ
నిన్ను కొలిచి వున్నవాడ.. మిన్నులందుకున్నవాడ
ఆ....ఆ... ఆ.... ఆ...
నీ ఆరాధకుడను.. ఆస్వాదకుడను.. అనురక్తడనూ..
నీ ప్రియభక్తుడనూ..


అభినవ తారవో .. నా అభిమాన తారవో..
అభినవ తారవో.. 
శివరంజనీ ... శివరంజనీ


No comments:

Post a Comment