చిత్రం : శ్రీవారి ముచ్చట్లు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
కాళ్ళగజ్జ కంకాళమ్మా.. కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా?
వేగుచుక్కా వెలగ పండు.. బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా?
పెళ్ళీ అంటే.. చుక్క పెట్టుకొచ్చా.. ఆ... ఆ..
రమ్మన్నావంటే.. గజ్జెలేసుకొచ్చా... ఆ.. ఆ..
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా.. ఆ.. ఆ..
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా.. ఆ.. ఆ...
హోయ్ కాళ్ళగజ్జ కంకాళమ్మా... హ ... హ
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా... హ... హ
చరణం 1 :
నిన్ను చూడగానే నాకు వయసు తెలిసింది
వయసు తెలియగానే పెళ్ళి గురుతుకొచ్చింది
కాళ్ళ మట్టెలు.. రాళ్ళ పోగులు.. ఎర్ర గాజులు.. నల్ల పూసలు.. సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
పెళ్ళి అనగానే నువ్వు గుర్తుకొచ్చా వు
నువ్వు గురుతు రాగానే ఆశ చచ్చిపోయింది
కాషాయాలు.. కమండలలౌ.. రుద్రాక్షలు.. పులిచర్మాలు సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
నువ్వు ఊఁ అంటే రంగంలోకి దిగిపోతాను
అరెరెరెరే కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ..
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ..
అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ..
బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా హా హా హా
చరణం 2 :
పువ్వు పుట్టగానే గుప్పు గుప్పు మంటుంది
నేను పుట్టగానే నువ్వు నువ్వు అన్నాను
వెండి కంచము.. పందిరి మంచము.. గాలి పింఛము.. పూలగుఛ్చము సిద్ధం చేశాను
నువ్వు ఊఁ అంటే తలుపుకి గడియ పెట్టేస్తాను
నువ్వు ఊఁ అంటే తలుపుకి గడియ పెట్టేస్తాను
రాతిరిపూట కలలోకి నువ్వే వచ్చావు
జాతరలోని అమ్మోరుని గుర్తుకు తెచ్చావు
వేప మండలు.. కల్లు కుండలు.. కోడి పెట్టలు.. పసుపు బట్టలు.. సిద్ధం చేసాను
నువ్వు ఊఁ అంటే జాతర పెట్టేస్తాను
నువ్వు ఊ అంటే జాతర పెట్టేస్తాను
అరె అహా కాళ్ళగజ్జ కంకాళమ్మా.. హ హ..
కాళ్ళకు గాజ్జెలు ఎక్కడివమ్మా.. హ హ హ..
అరె వేగుచుక్కా వెలగ పండు.. హ హ హ..
బుగ్గన చుక్క ఎక్కడిదమ్మా
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా...
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా...
పెళ్ళీ అంటే..చుక్క పెట్టుకొచ్చా
రమ్మన్నావంటే గజ్జెలేసుకొచ్చా
లా లా లా..... లా లా లా.... లా లా లా.... లా లా లా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1863
No comments:
Post a Comment