Saturday, September 20, 2014

సరిగమపదని స్వరధార

చిత్రం :  శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య  గానం : బాలు    
 
పల్లవి :

తననం తననం తననం

గమప మపని దనిసా.....
సనిదప సనిదప
దపగరి దపగరి
సనిద నిదప దపగ పగరిస సా పా గరి సా
సా సా సా సా
రీ రీ రీ రీ
గా గా గా గా
పా పా పా పా

సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధ్రువతార  

సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధ్రువతార 

వీణవై... వేణువై... మువ్వవై... వర్ణమై...

వీణవై.. జాణవై.. వేణువై... వెలదివై

మువ్వవై.. ముదితవై.. వర్ణమై.. నా స్వర్ణమై

నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావే 

సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధ్రువతార  

నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార.. రస సాగర యాత్రకు ధ్రువతార

చరణం 1 :

అరుణం అరుణం ఒక చీరా.... అంబరనీలం ఒక చీరా
అరుణం అరుణం ఒక చీరా... అంబరనీలం ఒక చీరా

మందారంలో మల్లికలా ఆకాశంలో చంద్రికలా

అందాలన్నీ అందియలై... శృంగారంలో నీ లయలై

అందాలన్నీ అందియలై... శృంగారంలో నీ లయలై

అలుముకున్న పూతావిలా... అలవికాని పులకింతలా  

హిందోళ రాగ గంధాలు నీకు ఆందోళికా సేవగా

ఆ....ఆ....ఆ....ఆ....

సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధ్రువతార 

నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధ్రువతార 

చరణం 2 :

హరితం హరితం ఒక చీరా... హంసల వర్ణం ఒక చీరా

హరితం హరితం ఒక చీరా... హంసల వర్ణం ఒక చీరా

శాద్వలాన హిమదీపికలా... శరద్వేళ అభిసారికలా 

చరణాలన్నీ లాస్యాలై... నీ చరణానికి దాస్యాలై

అష్టపదుల ఆలాపనే... సప్తపదుల సల్లాపమై

పురివిప్పుతున్న పరువాల పైట సురటినే వీవగా ఆ.... 

ఆ.....ఆ.....ఆ.....ఆ.....ఆ.....

సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధ్రువతార 

నెలవంక పల్లకిలో ఇలవంక దిగిరావే

సరిగమపదని స్వరధార... రస సాగర యాత్రకు ధ్రువతార 

No comments:

Post a Comment