Saturday, September 20, 2014

పూలు గుసగుసలాడేనని
చిత్రం :  శ్రీవారు మావారు (1973)
సంగీతం : జి.కె. వెంకటేశ్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు      పల్లవి :


పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. హా.... 


పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. అ.... హా.... 


లాలలలల లాలల... లలలాలలల.. 

లాలలలల లాలల... లలలాలలల..చరణం 1 :


మబ్బుకన్నెలు పిలిచేనని..
మనసు రివ్వున ఎగిసేనని..
వయసు సవ్వడి చేసేనని.. ఇపుడే తెలిసిందీ....
రు రు రు రు..ఆ..ఓ 


పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. అ.... చరణం 2 :
అలలు చేతులు సాచేనని..
నురుగు నవ్వులు పూచేనని..
నింగి నేలను తాకేనని..నేడే తెలిసిందీ..!!
రు రు రు రు..ఆ.. ఓ..


పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ....
టుర్..ఆ ఆ హు...ఆ హు..
చరణం 3 : 
టుర్..ఆ ఆ హు...ఆ హు.. 


పైరు పచ్చగ ఎదిగున్నది...
పల్లెపడుచుల విసురున్నది...
కొత్త సొగసే రమ్మన్నది...
గుండె ఝుమ్మన్నది... 


రు..రు..రు..రు... హో..హొ..
పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ..

గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..

అది ఈరోజే తెలిసిందీ....No comments:

Post a Comment