Monday, October 13, 2014

నవ్వుతూ వెళ్ళిపో

చిత్రం :   స్రవంతి (1986)

సంగీతం :   చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :   బాలు 


పల్లవి :


నవ్వుతూ వెళ్ళిపో ... నువ్వుగా మిగిలిపో

పువ్వులా రాలిపో... తావిలా మిగిలిపో

వేసవిలో మల్లెలా ... వేదనలో మనిషిగా

కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా


నవ్వుతూ వెళ్ళిపో ... నువ్వుగా మిగిలిపో

పువ్వులా రాలిపో... తావిలా మిగిలిపో


చరణం 1 :


మురిపించే చిరునవ్వే పసిపాపలలో అందమూ...

పకపకలాడే పాపల నవ్వే బాపూజీకి రూపమూ...

 

పగనైన ప్రేమించు ఆ నవ్వులు

శిలనైన కరిగించు ఆ నవ్వులు

వేకువలో కాంతిలా... వేదనలో శాంతిలా...

చిరకాలం నవ్వాలి స్వాతిలా.. ఆరని జ్యోతిలా..


నవ్వుతూ వెళ్ళిపో ...నువ్వుగా మిగిలిపో

పువ్వులా రాలిపో...తావిలా మిగిలిపో


చరణం 2 :


ఉదయించే తూరుపులో కిరణాలన్ని నవ్వులే...

వరములు కోరే దేవుడికిచ్చే హారతి కూడా నవ్వులే...

 

మృతినైన గెలిచేటి ఈ నవ్వులు.. నీ పేర మిగిలేటి నీ గురుతులు

నవ్వులతో సంతకం... చేసిన నా జీవితం...

అంకితమే చేస్తున్నా కవితలా... తీరనీ మమతలా...


నవ్వుతూ వెళ్ళిపో ... నువ్వుగా మిగిలిపో

పువ్వులా రాలిపో... తావిలా మిగిలిపో

వేసవిలో మల్లెలా ... వేదనలో మనిషిగా

కలకాలం గగనంలో తారలా ఆరనీ దివ్వెలా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=12053

No comments:

Post a Comment