Monday, October 13, 2014

నీవుంటే వేరే కనులెందుకూ

చిత్రం :  స్నేహం (1977)

సంగీతం :   కె.వి. మహదేవన్

గీతరచయిత : సినారె

నేపథ్య గానం :  బాలు 

పల్లవి :

నీవుంటే వేరే కనులెందుకూ.. నీకంటే వేరే బ్రతుకెందుకూ

నీ బాటలోని అడుగులు నావే.. నా పాటలోని..మాటలు నీవే

నీవుంటే వేరే కనులెందుకూ.. నీకంటే వేరే బ్రతుకెందుకూ

నీ బాటలోని అడుగులు నావే.. నా పాటలోని..మాటలు నీవే....

నీవుంటే వేరే కనులెందుకూ

చరణం 1 :

నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు.. నువు చెంతలేకుంటే చీకటి

నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు.. నువు చెంతలేకుంటే చీకటి

నీ చేయి తాకితే..తీయని వెన్నెల..

చేయి తాకితే..తీయని వెన్నెల..

అలికిడి వింటేనే తొలకరి జల్లు..

నీవుంటే వేరే కనులెందుకూ.. నీకంటే వేరే బ్రతుకెందుకూ...

నీ బాటలోని అడుగులు నావే.. నా పాటలోని..మాటలు నీవే....

నీవుంటే వేరే కనులెందుకూ....

చరణం 2 :

నిన్న రాతిరి ఓ..ఓ..కలవచ్చింది..ఆ కలలో ఒక దేవత దిగి వచ్చిందీ..

నిన్న రాతిరి ఓ..ఓ..కలవచ్చింది..ఆ కలలో ఒక దేవత దిగి వచ్చిందీ..

చందమామ కావాలా.. ఇంద్రధనువు కావాలా..

అమ్మ నవ్వు చూడాలా.. అక్క ఎదురు రావాలా..

చందమామ కావాలా.. ఇంద్రధనువు కావాలా..

అమ్మ నవ్వు చూడాలా.. అక్క ఎదురు రావాలా..

అంటూ అడిగిందీ..దేవత.. అడిగిందీ..

అప్పుడు నేనేమన్నానో తెలుసా..

... ...... .............. ...... .....

వేరే కనులెందుకనీ..నీకంటే వేరే బ్రతుకెందుకనీ..

లాలలలాలా.. లలలలలలాలలాల

హ్మూ...హూ..హూ..హూహూ లాలలలలాలా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7232

No comments:

Post a Comment