Tuesday, October 7, 2014

మేడంటే మేడా కాదు

చిత్రం :  సుఖదుఃఖాలు (1968)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత :  దేవులపల్లి
నేపథ్య గానం :  సుశీల 

పల్లవి :

మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది
 
చరణం 1 :

నేనైతే ఆకు కొమ్మ... తానైతే వెన్నెల వెల్ల
నేనైతే ఆకు కొమ్మ... తానైతే వెన్నెల వెల్ల
పదిలంగా నేసిన పూసిన.... పొదరిల్లు మాది  

మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది
 
చరణం 2 :

కోవెలలొ వెలిగే దీపం ... దేవి మా తల్లి
కోనలలో తిరిగే పాటల గువ్వ.... మా చెల్లి
గువ్వంటే గువ్వా కాదు.... గొరవంక గాని
వంకంటే వంకా కాదు.... నెలవంక గాని

మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది
 
చరణం 3 :

గోరింక పెళ్ళైపొతే .... ఏ వంకో వెళ్ళిపొతే
గోరింక పెళ్ళైపొతే .... ఏ వంకో వెళ్ళిపొతే
గూడంతా గుబులై పోదా ? గుండెల్లో దిగులై పోదా ? 

మేడంటే మేడా కాదు... గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది
 
పదిలంగా అల్లుకున్నా.... పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4801

No comments:

Post a Comment