Monday, October 13, 2014

స్నేహబంధము ఎంత మధురము

చిత్రం :  స్నేహ బంధం (1973)

సంగీతం :  సత్యం

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  జి. ఆనంద్, బాలు, సుశీల

పల్లవి :

స్నేహబంధము ఎంత మధురము.. చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

స్నేహబంధము ఎంత మధురము.. చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

ఆ హా హా అహహా ఆ ఆ... లా లలా లలలా లలలలా

చరణం 1 :

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో.. ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో.. ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో

ఒకటే దొరుకుతుంది జీవితంలో....

ఒకటే దొరుకుతుంది జీవితంలో... అది ఓడిపోదు.. వాడిపోదు.. కష్టసుఖాల్లో...

స్నేహబంధము ఎంత మధురము... చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

చరణం 2 :

మల్లెపూవు నల్లగా మాయవచ్చును.. మంచు కూడ వేడి సెగలు ఎగయ వచ్చును

మల్లెపూవు నల్లగా మాయవచ్చును.. మంచు కూడ వేడి సెగలు ఎగయ వచ్చును

పువ్వు బట్టి  తేనె రుచి మారవచ్చును...

పువ్వు బట్టి  తేనె రుచి మారవచ్చును... చెక్కు చెదరనిది స్నేహమని నమ్మవచ్చును

స్నేహబంధము ఎంత మధురము... చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

ఆ హా హా అహహా ఆ ఆ.. లా లలా లలలా లలలలాhttp://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3571

No comments:

Post a Comment