Sunday, October 26, 2014

నా రాశి.. కన్య రాశి

చిత్రం :  అల్లరి పిల్లలు (1978)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్యగానం :  బాలు,  సుశీల
పల్లవి :


నా రాశి.. కన్య రాశి.. నా రాశి.. మిథున రాశి
కలిసేనా జాతకాలు.. కలవాలి జీవితాలు


నా రాశి.. కన్య రాశి.. నా రాశి.. మిథున రాశి
కలిసేనా జాతకాలు.. కలవాలి జీవితాలు
నా రాశి.. కన్య రాశి...


చరణం 1 :


రాముడు వెలసిన శుభలగ్నములో.. నేను నీకై వెలిశాను
జానకి వెలసిన శుభఘడియలలో.. నేను నీకై వెలిశాను  


అయితే మనలో అనురాగం.. కథగా నిలుచును కలకాలం
మనకిక తప్పదు సహవాసం.. నీతో రానా వనవాసం... 


నీ రాశి.. కన్య రాశి.. నా రాశి.. మిథున రాశి
కలిసేనా జాతకాలు.. కలవాలి జీవితాలు
నా రాశి.. కన్య రాశి...
చరణం 2 :


ఎవరూ చూడని ఏకాంతములో ఎదలు ఒకటైపోవాలి..
నాలుక పలికే మాటల వెనుక నీ కథలన్నీ తెలియాలి..
ఎవరూ చూడని ఏకాంతములో ఎదలు ఒకటైపోవాలి..
నాలుక పలికే మాటల వెనుక నీ కథలన్నీ తెలియాలి..


సాగించాలి సంసారం.. లేదా రేపే సన్యాసం..
వద్దు ఎందుకు సన్యాసం.. బుద్ధిగ చేద్దాం సంసారం..   నీ రాశి.. కన్య రాశి.. నీ రాశి.. మిథున రాశి
కలిసేను  జాతకాలు.. కలవాలి జీవితాలు
నా రాశి.. కన్య రాశి...

అహహాహ.. ఆహహహా.. 


No comments:

Post a Comment