Tuesday, October 7, 2014

ఆకాశాన సూర్యుడుండడు (female)

చిత్రం :  సుందరకాండ (1993)
సంగీతం : కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  చిత్రపల్లవి :


ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా


ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల?
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగాచరణం 1 :


కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా


పుట్టే ప్రతి మనిషి కను మూసే తీరూ
మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరూ
మమతానురాగ స్వాగతాలు పాడ
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగాచరణం 2 :


ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ మార్చుకున్న ఈ రోజాకి
జన్మబంధమూ ప్రేమ బంధమూ.. పూటే చాలులే
పంజరమై బ్రతుకు మిగులూ.. పావురమే బైటికెగురూ


మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట


నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా


No comments:

Post a Comment