Tuesday, December 30, 2014

అంజలిదే గొనుమా... ప్రియతమా

చిత్రం  :  ప్రేమ బంధం (1976)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  : సుశీల 



పల్లవి :


అంజలిదే గొనుమా ప్రియతమా.. మంజుల బృందా నికుంజ నిరంజన
అంజలిదే గొనుమా ప్రియతమా.. మంజుల బృందా నికుంజ నిరంజన
అంజలిదే గొనుమా ...


చరణం 1 :


గుజ్జురూపమున  కమిలిన కుబ్జను.. బుజ్జగించి లాలించి సొగసిడి
గుజ్జురూపమున  కమిలిన కుబ్జను.. బుజ్జగించి లాలించి సొగసిడి 


ముజ్జగాలకే ముద్దబంతిగా..
ముజ్జగాలకే ముద్దబంతిగా.. మలచిన దేవా... మహానుభావ

అంజలిదే గొనుమా... ప్రియతమా



చరణం 2 :


నిండు కొలువులో పాండవ కాంతకు.. వలువలూడ్చుతరి వనిత మొరవిని
నిండు కొలువులో పాండవ కాంతకు.. వలువలూడ్చుతరి వనిత మొరవిని


మానము గాచి...  మానిని బ్రోచిన..
మానము గాచి...  మానిని బ్రోచిన..  మాధవ దేవా... మహానుభావా...  


అంజలిదే...  గొనుమా


చరణం 3 :



బృందావనిలో చందమామవై.. చెలువల కలువల జేసి రమించి
బృందావనిలో చందమామవై ..చెలువల కలువల జేసి రమించి


బిసజపత్ర జల బిందువువై..
బిసజపత్ర జల బిందువువై...  ఇల మసలిన దేవా


మహానుభావా .. అంజలిదే గొనుమా    




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2056


No comments:

Post a Comment