Tuesday, December 30, 2014

ఏమని పిలువనురా నిను

చిత్రం :  శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్   (1976)
సంగీతం :  పెండ్యాల  
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా
ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా


అండ పిండ బ్రహ్మాండమంతటా నిండియున్న ఓ స్వామీ
నిను నే ఎక్కడ వెదుకుదురా ఏ విధి కొలువనురా


అంగ రంగ సర్వాంగమంతటా నిండియున్న ఓ స్వామీ
ఎక్కడ వెదుకుదురా.. ఏమని పిలువనురా


చరణం 1 :


రంగు రంగుల పువ్వులలో నీ రమ్యరూపమే చూసేరు
రంగు రంగుల పువ్వులలో నీ రమ్యరూపమే చూశాను


పున్నమి జాబిలి వెన్నెలలో నీ ఉనికిని తెలియగజాలేరు
పున్నమి జాబిలి వెన్నెలలో నీ ఉనికిని  కనుగొన గలిగాను


గల గల పారే సెలయేరులలో..
గల గల పారే సెలయేరుల నీ గానమునే వినగలిగాను


కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో.. కొలువై యున్నావట స్వామీ
ఏ గతి చూతునురా..  ఏమని పిలువనురా


చరణం 2 :


అంతే లేని ఆకసమే నీ ఆలయమని పూజించేరు
అందాలొలికే అరవిందాలే నీ చిరునవ్వని ఎంచాను


నీవే లేనీ తావేలేదని నిమిష నిమిషము తలచేరు
నాలో నిన్నే చూసిన నేను ఎక్కడ వెదుకుదురా స్వామీ


ఏ విధి కొలువనురా..   ఏమని పిలువనురా





No comments:

Post a Comment