Monday, December 15, 2014

అయ్య లాలీ ముద్దులయ్య లాలీ

చిత్రం :  తాతమ్మ కల (1974)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  భానుమతి 

పల్లవి :

అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. మురిపాల బుజ్జి ముసలయ్యలాలీ
అయ్య లాలీ ముద్దులయ్య లాలీ.. మురిపాల బుజ్జి ముసలయ్యలాలీ
లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ

చరణం 1 :

తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా..  నన్ను జూచి చిలిపిగా నవ్వుతున్నావా
తాతవే మనవడిగా పుట్టుకొచ్చావా.. నన్ను జూచి చిలిపిగా నవ్వుతున్నావా

ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశానూ.. ఎన్నాళ్ళకో నిన్ను మళ్ళీ చూశానూ
ఇందుకేనేమో నేను బ్రతికే ఉన్నానూ

అయ్య లాలీ ముద్దులయ్య లాలీ..  మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ
లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ

చరణం 2 :  

గొప్ప యింటి వాళ్ళమనే పేరొకటే మిగిలిందీ..  చెప్పుకుంటే సిగ్గు అప్పెంతో పెరిగిందీ
ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేనూ..  ఈ తాతమ్మ ఇంకేమి కట్టబెట్టేనూ
బుగ్గ గిల్లి నీకింత ఉగ్గు పట్టేనూ

అయ్య లాలీ ముద్దులయ్య లాలీ..  మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ
లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ

చరణం 3 : 

తిన్నదంతా కూడా జీర్ణమైపోవాలీ.. వెయ్యేనుగుల బలం నీకు రావాలీ
నీ పెళ్ళిదాకా నే బ్రతికే ఉండాలీ.. నీ పెళ్ళిదాకా నే బ్రతికే ఉండాలీ
నీ కళ్ళ ముందే నేను రాలిపోవాలీ

అయ్య లాలీ ముద్దులయ్య లాలీ..  మురిపాల బుజ్జి ముసలయ్య లాలీ 
లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ

No comments:

Post a Comment