Monday, December 15, 2014

ఏమండి వదినగారూ

చిత్రం :  తాతమ్మ కల (1974)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి 




పల్లవి :


ఏమండి వదినగారూ.. ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ
ఏమండి వదినగారూ..  చెప్పండి కాస్త మీరూ 


మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ..
మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ..
ఎలా వేసుకున్నారూ . . ఏమండి వదినగారూ 



చరణం 1 :


కాలేజి రోడ్డుమీదా కన్నుకొట్టావా..  సినిమాలో సీటు వెనక కాలు గోకావా
కాలేజి రోడ్డుమీదా కన్నుకొట్టావా..  సినిమాలో సీటు వెనక కాలు గోకావా


అబ్బబ్బ ఏమి లక్కు..  ఇక నో మోరు చిక్కు
అబ్బబ్బ ఏమి లక్కు..  ఇక నో మోరు చిక్కు
ఇది న్యూ మోడలు ట్రిక్కూ.. హహహహహ . .



ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ
మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ
ఎలా వేసుకున్నారూ . . ఏమండి వదినగారూ 



చరణం 2 :  



కట్నం తప్పే వీలు కనిపెట్టావే.. రెడీమేడ్ హస్బెండును పట్టేసావే
కట్నం తప్పే వీలు కనిపెట్టావే.. రెడీమేడ్ హస్బెండును పట్టేసావే 


వేసావులే బలె ఎత్తు.. చేసావులే అన్నను చిత్తు వేసావులే బలె ఎత్తు..
చేసావులే అన్నను చిత్తు.. చెప్పవే ఆ గమ్మత్తు.. ఒహో అహా


ఏమండి వదినగారూ..  ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ
ఏమండి వదినగారూ.. చెప్పండి కాస్త మీరూ.. 


మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ
మా అన్నయ్యను బుట్టలోన వేసుకున్నారూ..
ఎలా వేసుకున్నారూ..  ఏమండి వదినగారూ 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18902


No comments:

Post a Comment