Tuesday, March 24, 2015

వసంత గాలికి వలపులు రేగ

చిత్రం :  శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి నాగేంద్ర రావు
నేపధ్య గానం :  జానకి, బాలమురళి కృష్ణ   

పల్లవి :

వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ
వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ

తనువు మనసు ఊగి తూగి..
తనువు మనసు ఊగి తూగి.. ఒక మైకం కలిగేనులే
ఈ మహిమ నీదేనులే ప్రేమతీరు ఇంతేనులే

చరణం 1 :

రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా
రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా

తనువు మనసు ఊగి తూగి
తనువు మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులే
ఈ మహిమ నీదేనులే... ఆహా భలే హాయిలే

ఈ మహిమ నీదేనులే

చరణం 2 :

విలాస మాధురి వెన్నెల కాగా... విహార వీణలు విందులు కాగా
విలాస మాధురి వెన్నెల కాగా...  విహార వీణలు విందులు కాగా

ఏకాంతంలో నీవూ నేనే
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనుపించెనే

ఈ మహిమ నీదేనులే... ప్రేమ తీరు ఇంతేనులే
ఈ మహిమ నీదేనులే... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=595

No comments:

Post a Comment