Thursday, August 20, 2015

సుందర బృందవనిలో




చిత్రం :  కృష్ణార్జునులు (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


సుందర బృందవనిలో ఈ సుందరి సుమసుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా
సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి


జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శృతి నీవు అంది...లయ నేనే అంది...
కనుచూపే కల్యాణమంది..కనుచూపే కల్యాణమంది


సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి


చరణం 1 :


నా మధు మాసాల ఉదయినిగా.. నా మందహాసాల మధువనిగా
ఆ..హా..హ..ఆ..హా..హ..హా హ హా హ హా
నా మధు మాసాల ఉదయినిగా..నా మందహాసాల మధువనిగా


చిరుకాటుకలద్దితే చీకటిగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
చిరుకాటుకలద్దితే చీకటిగా
సిరిమల్లె తురిమితే పున్నమిగా
స్వరమైతే నీవు.. జతి నేను అంది..
మనసంటే మాంగల్యమంది.....
మనసంటే మాంగల్యమంది.....


సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి


చరణం 2 :


ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక
ఆహా..ఆహహా..హహాహ..హహహా..హా..హా..
ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక


ఉలి చూపు తగిలితే శిల్పముగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
ఉలి చూపు తగిలితే శిల్పముగా
చెలి తాను కదిలితే నాట్యముగా
భావాలు నీవి.. రాగాలు నావి
సగమైతే జగమూగునంది.. సగమైతే జగమూగునంది


సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా.
జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శుతి నీవు అంది..లయ నేను అంది
కనుచూపే కల్యాణమంది.. కనుచూపే కల్యాణమంది



సుందర బృందవనిలో ఈ సుందరి సుమసుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా
సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2674

No comments:

Post a Comment