Wednesday, September 30, 2015

మాయ చేసి పోతివిరో నాగులూ

చిత్రం :  జీవితం (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు 

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి :

మామిడి తోపుల్లోనా..  మాపటేల మాటేసి

చిక్కుడు పాదూకాడా ..  చీకటేల పట్టేసి

మామిడితోపుల్లోనా..  మాపటేల మాటేసి

చిక్కుడుపాదూకాడా..  చీకటేల పట్టేసి

చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి

చెప్పలేని రుచులెన్నో.. చిటికెలోన చూపించి.. చూపించి ? 

మాయ చేసి పోతివిరో నాగులూ... నా మాట మరచిపోతివిరే నాగులూ

ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో

ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో

చరణం 1 :

నిన్నే కావాలని ఎన్నుకొంటిని.. నీ చుట్టూ నా మనసే అల్లుకొంటిని

రేకెత్తే నా సొగలే నీకు ముడుపు కడితిని

ఇన్నీచేసినదాన్ని ఏమెరుగని చిన్నదాన్ని

ఇన్నీచేసినదాన్ని ఏమెరుగని చిన్నదాన్ని

మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులూ

ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో

ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో

చరణం 2 :

నట్టింట ఒంటరిగా కాచుకొంటిని.. నడిరాతిరి ఉసురుసురంటూ వేచియుంటిని

ఆకు చప్పుడైనా నీ అడుగులే అనుకొంటిని

నిన్నే నమ్మినదాన్ని... నీకే నచ్చినదాన్ని

నిన్నే నమ్మినదాన్ని... నీకే నచ్చినదాన్ని....  కాదు మరి

మాయ చేసి పోతివిరో నాగులూ.. నా మాట మరచిపోతివిరో నాగులూ

ఓ లమ్మో... ఓ లమ్మో... ఓ లమ్మో.. ఒరి నాయనో

ఓ లమ్మో.. ఒరి నాయనో.. ఓ లమ్మో.. ఒరి నాయనో..  ఓ లమ్మో.. ఒరి నాయనో

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=6317

No comments:

Post a Comment