Thursday, October 1, 2015

కళ్ళు చూడు కళ్ళందం చూడు

చిత్రం :  బలిదానం (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

కళ్ళు చూడు కళ్ళందం చూడు.. నడుము చూడు నడకందం చూడు
నవ్వు చూడు నవ్వందం చూడు..  మొగలి రేకు నా మీసం చూడు
నాతో పోటి ఎవరూ లేరయ్యో.. రంభా ఊర్వశి నిలబడలేరయ్యో

నవ్వు చూడు నవ్వందం చూడు..  మొగలి రేకు నా మీసం చూడు
నవ్వు చూడు నవ్వందం చూడు..  మొగలి రేకు నా మీసం చూడు
నాతో పోటి ఎవరూ లేరమ్మా.. మన్మథుడైనా నా సరి కాడమ్మో

చరణం 1 :

పిల్లను చూస్తే పిటపిటమంటుంది.. నాలో కోరిక ఎపుడెపుడు అంటుంది
అందగాడా నువ్వు తొందర చేస్తే వేగేది ఎట్టా?
ఉండీ లేని నీ నడుముని చూస్తూ ఆగేది ఎట్టా?

కలలోకి నన్ను రప్పించుకో.. తలదిండుతోనే సరిపుచ్చుకో
కలలోకి అయితే వస్తానంటావ్ కౌగిలికైతే రాలేవా
జంటే లేని ఒంటరివాన్ని పోనిలేమ్మని అనలేవా 

కళ్ళు చూడు కళ్ళందం చూడు.. నడుము చూడు నడకందం చూడు
నవ్వు చూడు నవ్వందం చూడు..  మొగలి రేకు నా మీసం చూడు
నాతో పోటి ఎవరూ లేరమ్మా... హాహ్హా
మన్మథుడైనా నా సరి కాడమ్మో... ఆహా

చరణం 2 :

మాటలు చెప్పి మనసే దోచాడు..  లేదంటూనే ఇంతకు తెచ్చాడు
దొండపండు నీ పెదవిని చూస్తే నాకేదో కచ్చి
కన్నుగీటి నువ్వు రమ్మంటుంటే నాకేమో సిగ్గు 

నా కచ్చికి నీ సిగ్గుకి ముడి వేసి చూడు ఒక ముద్దుతోటి
నిన్నో మొన్నో కలిసాడు అప్పుడే ముద్దులు అడిగాడు
మొహమాటానికి అవునన్నానా ఇంకా ఏమో అంటాడు

నవ్వు చూడు నవ్వందం చూడు..  మొగలి రేకు నా మీసం చూడు
నవ్వు చూడు నవ్వందం చూడు..  మొగలి రేకు నా మీసం చూడు
నాతో పోటి ఎవరూ లేరమ్మా... హాహ్హా
మన్మథుడైనా నా సరి కాడమ్మో... ఆహా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2166

No comments:

Post a Comment