Saturday, October 3, 2015

పన్నెండేళ్ళకు పుష్కరాలు

చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

తం తననం తం తననం
తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు.. ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో.. పరువాలు కలవాలి తాపాలతో

తం తననం తం తననం
తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు.. ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో.. పరువాలు కలవాలి తాపాలతో

తం తననం తం తననం
తం తననం తం తననం 

చరణం 1 :

ముద్దుగా పుట్టాను పొదలలో పువ్వులాగా
దిద్దితే ఎదిగాను పలకలో రాతలాగా
అల్లరిగా జల్లులుగా కదిలావు ఏరులాగా
ఒంపులుగా సొంపులుగా కులికావు ఈడురాగా

ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా.. తోడైనవాడితో కలిసిపోగా హా..
ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా.. తోడైనవాడితో కలిసిపోగా
గలగలలుగ కిలకిలలుగ.. తొలికలలుగ వడి సెలలుగ
గలగలలుగ కిలకిలలుగ.. తొలికలలుగ వడి సెలలుగ
ఉరికాను నిన్ను చేరగా

తం తననం తం తననం
తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. పదహారేళ్ళకు పరువాలు

చరణం 2 :

మొక్కువై ముడుపువై ఉన్నావు ఇన్నినాళ్ళు
మక్కువై మనసువై తీర్చుకో మొక్కుబళ్ళు
మేలుకొని కాచుకొని వెయ్యైనవి రెండు కళ్ళు
చేరుకొని ఆనుకొని నడవాలి కాళ్ళు కాళ్ళు

చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు

చెరిసగముగ సరిసమముగ.. చిరుజగముగ చిరునగవుగ
చెరిసగముగ సరిసమముగ.. చిరుజగముగ చిరునగవుగ
చేద్దాము కాపురాలు

తం తననం తం తననం
తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు.. ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో.. పరువాలు కలవాలి తాపాలతో

తం తననం తం తననం
తం తననం తం తననం 

No comments:

Post a Comment