Saturday, October 3, 2015

ఉత్తరాన.. ఊరవతల

చిత్రం : జగ్గు (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


ఉత్తరాన.. ఊరవతల.. ఒక తోట ఉంది తెలుసా
ఆ తోటలో పొద చాటులో.. ఒక మాట వినవే మనసా
 



ఉత్తరాన.. ఊరవతల.. ఒక తోట ఉంది తెలుసా
ఆ తోటలో.. తెర చాటులో.. మోమాట పడకే వయసా




చరణం 1 :



పడుచు ఊపిరి తావి అడిగే పాల పిట్ట ఒకటుంది
పాలపిట్టకు ఊసు తెలిపే జారుపైటా ఒకటుంది
నెమలి కన్నెలు సొగసులాడికి పగలుపడుతుంటే
మొగలు రేకులు మగతనానికి పదును పెడుతుంటే
ఆ ఆటలో... సైయ్యాటలో... మనసైనదేదో తెలుసా



ఉత్తరాన.. ఊరవతల.. ఒక తోట ఉంది తెలుసా
ఆ తోటలో పొద చాటులో.. ఒక మాట వినవే మనసా


చరణం 2 :



పలకమారిన పండు కొసరే రామచిలక ఒకటుంది
చిలకపాపకు చీరకట్టే సిగ్గుమొలక ఒకటుంది
గరిక పువ్వులు కాలి మువ్వలా తళుకుమంటుంటే
కలువరేకులు కలవరింతల కనులు కడుతుంటే
నీ జంటలో... సందేలలో.. అడిగేది ఏదో తెలుసా



ఉత్తరాన.. ఊరవతల.. ఒక తోట ఉంది తెలుసా
ఆ తోటలో పొద చాటులో.. ఒక మాట వినవే మనసా




ఉత్తరాన.. ఊరవతల.. ఒక తోట ఉంది తెలుసా
ఆ తోటలో.. తెర చాటులో.. మోమాట పడకే వయసా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4175

No comments:

Post a Comment