స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Friday, October 9, 2015
నీవైన చెప్పవే ఓ మురళీ
చిత్రం : శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972)
సంగీతం : టి. వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
నీవైన చెప్పవే ఓ మురళీ..
ఇక నీవైన చెప్పవే ప్రియమురళీ.. నీవైన చెప్పవే ఓ మురళీ
అడుగడుగున నా ప్రియభామినికి.. అలుక ఎందుకని.. ఎందుకని
నీవైన చెప్పవే ఓ మురళీ
నీవైన చెప్పవే జాబిలీ..
ఇక నీవైన చెప్పవే ఓ జాబిలీ.. నీవైన చెప్పవే జాబిలీ
తలబంతి ఎవరో.. పదదాసి ఎవరో
తెలుసుకొమ్మనీ.. పిదప రమ్మనీ.. నీవైన చెప్పవే జాబిలీ
చరణం 1 :
అలుకలోన నా చెలియ వదనము.. అరుణ కమలమై విరిసెననీ
అలుకలోన నా చెలియ వదనము.. అరుణ కమలమై విరిసెననీ
ఆ కమలములోని తేనియలానగ.. కమలములోని తేనియలానగ
నామది భ్రమరమై ఎగసెననీ.. నీవైన చెప్పవే ఓ మురళీ
చరణం 2 :
కోటిపూలతో కులుకు తుమ్మెదకు.. ఈ తోటలో చొటులేదనీ
కోటిపూలతో కులుకు తుమ్మెదకు.. ఈ తోటలో చొటులేదనీ
మనసెరిగిన సత్యా విధేయునికే.. మనసెరిగిన సత్యా విధేయునికే
అనురాగ మధువు అందుననీ.. నీవైన చెప్పవే జాబిలీ
ఇక నీవైన చెప్పవే ఓ జాబిలీ.. నీవైన చెప్పవే జాబిలీ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment