Friday, October 9, 2015

ఎన్నాళ్లు వేచేను ఓ రామా






చిత్రం :  శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972)
సంగీతం : టి. వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల



పల్లవి : 



రామా.. రఘురామా
ఎన్నాళ్ళు వేచేను ఓ రామా.. నీకు ఇకనైన దయరాదా శ్రీరామా..
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
ఎన్నాళ్ళు వేచేను ఓ రామా.. నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా 



చరణం 1 :



నీ అండ నేచేర రాలేను రామా.. నా కొండకే నీవు రావయ్య రామా
ఏ జన్మకైనా.. నా జపము నా తపము.. నీవే నీవే రఘురామా
జగధభి రామా.. జానకి రామా.. జయరామా.. శ్రీరామా



ఎన్నాళ్లు వేచేను ఓ రామా.. నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా




చరణం 2 :



సీతమ్మ సేమం తెలిపానే.. నీ తమ్ముని ప్రాణం నిలిపానే

సీతమ్మ సేమం తెలిపానే.. నీ తమ్ముని ప్రాణం నిలిపానే

మహిరావణుని గుట్టు చెప్పానే.. నిన్ను మూపున ఇడుకొని మోశానే

ఇంతగ కొలిచిన నీ పదదాసుని..  

ఇంతగ కొలిచిన నీ పదదాసుని ఎటుల మరచితివయ్యా.. రామయ్యా 


ఎన్నాళ్లు వేచేను ఓ రామా.. నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
నీకు ఇకనైన దయరాదా శ్రీరామా
 


No comments:

Post a Comment