Thursday, January 7, 2016

ఆకాశానికి రవికిరణం..ఆరని హారతి

చిత్రం : సంగీత (1981)
సంగీతం : బాలు
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : జానకి  



పల్లవి :


ఆకాశానికి రవికిరణం.. ఆరని హారతి
కడలికి పున్నమి జాబిల్లి.. వెన్నెల హారతి
ఆకాశానికి  రవికిరణం..ఆరని హారతి
కడలికి పున్నమి జాబిల్లి.. వెన్నెల హారతి


త్యాగం మనిషికి ఆభరణం.. అది జీవన జ్యోతి
త్యాగం మనిషికి ఆభరణం.. అది జీవన జ్యోతి
కల్ల కపటం తెలియని హృదయం.. కర్పూర జ్యోతి
వెలిగే కర్పూర జ్యోతి
ఆకాశానికి రవికిరణం..ఆరని హారతి.. ఈ.. ఆరని హారతి 




చరణం 1 :



పుట్టిన రోజున పాపకు తల్లి పట్టేదే.. తొలి హారతి
కొత్త కోడలికి ముత్తైదువులు ఇచ్చేదే.. శుభ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి వెలిగించేదే.. శ్రీ హారతి
నిండు మనసుతో దేవుని కొలిచి వెలిగించేదే.. శ్రీ హారతి
కరిగి కరిగినా కాంతి తరగని..మంగళ హారతి.. ఆ జ్యోతి   


కల్లా కపటం తెలియని హృదయం.. కర్పూర జ్యోతి
ఆకాశానికి రవికిరణం.. ఆరని హారతి.. ఈ.. ఆరని హారతి



చరణం 2 :



విరిసిన కుసుం వాడిపోయినా.. పిందె గురుతుగా మిగిలేను
పండిన ఫలము నేల రాలినా.. విత్తనమైన మిగిలేను
ఆయువు తీరి మనిషి పోయినా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఆయువు తీరి మనిషి పోయినా.. సంతతి అయిన మిగిలేను
వయసు లేనిది.. వాడిపోనిది.. స్మృతిగా మాత్రం మిగిలేది   


కల్లా కపటం తెలియని హృదయం.. కర్పూర జ్యోతి

ఆకాశానికి  రవికిరణం.. ఆరని హారతి
కడలికి పున్నమి జాబిల్లి.. వెన్నెల హారతి
త్యాగం మనిషికి ఆభరణం.. అది జీవన జ్యోతి
కల్ల కపటం తెలియని హృదయం.. కర్పూర జ్యోతి
వెలిగే కర్పూర జ్యోతి
ఆకాశానికి రవికిరణం.. ఆరని హరతి..ఈ..ఆరని హారతి  






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7511





No comments:

Post a Comment