Thursday, January 7, 2016

ఎంకీ నే సూడలేనే

చిత్రం : నాకూ స్వతంత్రం వచ్చింది (1975)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల   



పల్లవి :


హైలో హైలో హైలో...  హైలో..
హైలో హైలో హైలో...  హైలో
హైయ్యా హైయ్యా...హైయ్యా హైయ్యా
ఎంకీ నే సూడలేనే..ఎలుతురులో నీ రూపు
ఎలిగి పోతుంటేనూ..ఆహా ఆహా ఓహో ఓహో మ్మ్ మ్మ్ 


ఈ ఎలుగు నీదేనురా.. ఊపిరి ఉండేదాకా
ఈ జనమ కడదాకా..ఆహా ఆహా ఆహా ఆహా ఆహా
హైలో హైలో హైలో హైలో..హైలో హైలో హైలో హైలో
సైయ్య సైయ్య...సైయ్య సైయ్య 



చరణం 1 :



ఏ యేళా సిగపూలై.. ఎన్నంటీ నేనుండనా
పొదలోనీ పూవల్లే నీ వొడిలో దాగనా
ఎదపైన రవ్వంత చోటిస్తే...  


ఈ ఎలుగు నీదేనురా.. ఊపిరి ఉండేదాకా
ఈ జనమ కడదాకా..ఆహా ఆహా ఓహో ఓహో మ్మ్ మ్మ్



చరణం 2 :



ఎన్నెల్లో సంద్రంలా.. నా మనసూ పొంగితే
సంద్రంలో కెరటాలై.. కోరికలే తరిమితే
ఊరిస్తూ ఉడికిస్తూ... నీ ఉంటే


ఎంకీ నే సూడలేనే..ఎలుతురులో నీ రూపు
ఎలిగి పోతుంటేనూ..ఆహా ఆహా ఆహా ఆహా ఆహా



చరణం 3 :



నీ పైనా మనసంతా.. ఈ పొద్దే తీరనీ
రేతిరినీ కౌగిలినీ.. ఈ తీరే నిలవనీ
వలపంతా చిలికిస్తూ  దరికొస్తే


ఎంకీ నే సూడలేనే..ఎలుతురులో నీ రూపు
ఎలిగి పోతుంటేనూ..ఆహా ఆహా ఆహా అహా అహా ఓహో ఓహో
ఈ ఎలుగు నీదేనురా..ఊపిరి ఉండేదాకా
ఈ జనమ కడదాకా..ఆహా ఆహా ఆహా ఆహా ఆహా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4012

No comments:

Post a Comment