Thursday, January 21, 2016

పగటి కలలు కంటున్న మావయ్యా




చిత్రం :  భలే రంగడు (1969)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి    





పల్లవి :



పగటి కలలు కంటున్న మావయ్యా
గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా
మావయ్యా..  ఓ మావయ్యా
మావయ్యా.. మావయ్యా

గలా గలా నవ్వేటి గంగమ్మా
బంగారు మేడలెన్నో కట్టానమ్మా
గంగమ్మా.. ఓ గంగమ్మా
గంగమ్మా.. ఓ గంగమ్మా 



చరణం 1 :




అందని కొమ్మకు నిచ్చెన ఏస్తున్నాడూ
అబ్బాయి యాడాడో చూస్తున్నాడూ
అందని కొమ్మకు నిచ్చెన ఏస్తున్నాడూ
అబ్బాయి యాడాడో చూస్తున్నాడూ

లక్షలు వచ్చేదాక కాచుకొన్నాడూ
అందాక మోజులన్ని దాచుకొన్నాడూ
అందాక మోజులన్ని దాచుకొన్నాడూ 



మావయ్యా.. ఓ మావయ్యా హోయ్ హోయ్ ....
మావయ్యా.. ఓ మావయ్యా



పైసలేంది దేవుడైన పలకరించడే అసలు  పలకరించడే
పైసలేంది దేవుడైన పలకరించడే అసలు  పలకరించడే
చూసి చూడనట్లు మొగం తిప్పుకొంటాడే
చూసి చూడనట్లు మొగం తిప్పుకొంటాడే
ముప్పై లక్షలు వచ్చే రోజు వున్నదే
నీకు నాకు జతలేదని రాసివున్నదే



గంగమ్మా.. ఓ గంగమ్మా
గంగమ్మా.. ఓ గంగమ్మా 


చరణం 2 : 



డాబు సరిగ కూసొంటే డబ్బులొస్తాయా
మాటలు దులిపేసుంటే మూటలొస్తాయా
డాబు సరిగ కూసొంటే డబ్బులొస్తాయా
మాటలు దులిపేసుంటే మూటలొస్తాయా



మావయ్యా నీ సంగతి తెలుసు లేవయ్యా
పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయ్యా
హాయ్.. పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయ్యా
మావయ్యా.. ఓ మావయ్యా హోయ్ హోయ్ ....
మావయ్యా.. ఓ మావయ్యా



రంగడంటే అల్లాటప్ప రంగడు కాదే.. భలే రంగడు వీడే
నలుగురిలో దర్జాగ వెలిగిపోతాడే
నలుగురిలో దర్జాగ వెలిగిపోతాడే
అత్తకొడుకు ఎంతవాడో అపుడు చూస్తావు
అబ్బో అబ్బో అని జేజేలు కొడతావు 

గంగమ్మా.. ఓ గంగమ్మా
గంగమ్మా.. ఓ గంగమ్మా


పగటి కలలు కంటున్న మావయ్యా
గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా
మావయ్యా ఓ మావయ్యా
మావయ్యా ఓ మావయ్యా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1728

No comments:

Post a Comment