Thursday, January 21, 2016

మనసే పొంగెను...ఈ వేళా




చిత్రం :  రైతు కుటుంబం (1972)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల   




పల్లవి :


మనసే పొంగెను.. ఈ వేళా..ఆ
వలపే పండెను.. ఈ వేళా..ఆ
మనసే పొంగెను ఈ వేళా..ఆ
వలపే పండెను ఈ వేళా..ఆ


తారల దారుల...  వెన్నెల వాడల
తారల దారుల... వెన్నెల వాడల
తనువే ఊగెను  ఉయ్యాలా
మనసే పొంగెను ఈ వేళా.. ఆ
వలపే పండెను ఈ వేళా.. ఆ



చరణం 1 :


నీల గగనాల ముంగిటా.. ఆణి ముత్యాల పందిటా..
మంగళ వాద్యాలు... మ్రోగగా.. నవపారిజాతాలు...కురియగా
జరుగునులే మన కళ్యాణమూ..
పలుకునులే జీవనరాగమూ..
పలుకునులే జీవనరాగమూ..



మనసే పొంగెను ఈ వేళా..
వలపే పండెను ఈ వేళా..
ఈవేళా..ఆ..ఆ.. ఈవేళా..ఆ 



చరణం 2 :



పూలపానుపున నేనుంటే.. తలుపు మాటున నీవుంటే
చిలిపిగ నీవే నను చేరగా.. సిగ్గులు నాలో చిగురించగా
తొలిరేయి మనకై పెరిగేనులే
కౌగిలిలో హాయి కరిగేనులే
కౌగిలిలో హాయి కరిగేనులే



మనసే పొంగెను...ఈ వేళా
వలపే పండెను...ఈ వేళా
ఈ వేళా..ఆ..ఆ..ఈ వేళా..ఆ






No comments:

Post a Comment