Tuesday, March 15, 2016

నేను నా దేశం



చిత్రం : నేను నా దేశం (1974)
సంగీతం :  సత్యం
గీతరచయిత : అంకిశ్రీ
నేపధ్య గానం : బాలు, సుశీల  




పల్లవి :


నేను నా దేశం పవిత్ర భారత దేశం
సాటి లేనిది దీటురానిది శాంతికి నిలయం మనదేశం


నేను నా దేశం పవిత్ర భారత దేశం
సాటి లేనిది దీటురానిది శాంతికి నిలయం మనదేశం


నేను నా దేశం పవిత్ర భారత దేశం



చరణం 1 :


అశోకుడేలిన ధర్మ ప్రదేశం... బుద్ధుడు వెలసిన శాంతి దేశం

బుద్ధం శరణం గచ్ఛామి...
ధర్మం శరణం గచ్ఛామి...
సంఘం శరణం గచ్ఛామి...
 

అశోకుడేలిన ధర్మ ప్రదేశం
బుద్ధుడు వెలసిన శాంతి దేశం
కులమత భేదం మాపిన త్యాగి
అమర బాపూజి వెలసిన దేశం

వందేమాతరం... వందేమాతరం... వందేమాతరం

కులమత భేదం మాపిన త్యాగి
అమర బాపూజి వెలసిన దేశం


నేను నా దేశం పవిత్ర భారత దేశం 




చరణం 2 :


కదం త్రొక్కిన వీర శివాజి... వీర శివాజి
వీర విహారిణి ఝాన్సీరాణి... ఝాన్సీరాణి
స్వరాజ్య సమరుడు అల నేతాజి...


జైహింద్... జైహింద్... జైహింద్


స్వరాజ్య సమరుడు అల నేతాజి
కట్టబ్రహ్మన పుట్టిన దేశం

నేను నా దేశం పవిత్ర భారత దేశం


చరణం 3:

ఆజాద్.. గోఖలే.. వల్లభాయ్.. పటేల్ ..లజపతి.. తిలక్.. నౌరోజీలు
ఆజాద్.. గోఖలే.. వల్లభాయ్.. పటేల్.. లజపతి.. తిలక్.. నౌరోజీలు

అంబులు కురిపిన మన అల్లూరి
అంబులు కురిపిన మన అల్లూరి
భగత్ రక్తము చిందిన దేశం

హిందూస్తాన్ హమారా హై...  హిందూస్తాన్ హమారా హై

నేను నా దేశం పవిత్ర భారత దేశం




చరణం 4 :


గుండ్ల తుపాకి చూపిన దొరలకు
గుండె చూపే మన ఆంధ్రకేసరి... మన ఆంధ్రకేసరి
శాంతి దూత మన జవహర్ నెహ్రు

శాంతి ... శాంతి... శాంతి

శాంతి దూత మన జవహర్ నెహ్రు
లాలబహుదూర్ జన్మించిన దేశం

జై జవాన్ జై కిసాన్...  జై జవాన్ జై కిసాన్... జై జవాన్ జై కిసాన్

నేను నా దేశం పవిత్ర భారత దేశం



చరణం 5 :


అదిగో స్వరాజ్య రధాన సారధి
అదిగో స్వరాజ్య రధాన సారధి
స్వరాజ్య రధాన సారధి
ఆదర్శనారి ఇందిరాగాంధీ 

ఘరీబి హటావో...  ఘరీబి హటావో

ఆదర్శనారి ఇందిరాగాంధీ
అడుగు జాడలో పయనిద్దాం
అఖండ విజయం సాధిదాం
అడుగు జాడలో పయనిద్దాం
అఖండ విజయం సాధిదాం


నేను నా దేశం పవిత్ర భారత దేశం
సాటిలేని ధీటు రానిది
శాంతికి నిలయం మన దేశం
నేను నా దేశం నేను నా దేశం నేను నా దేశం




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4603

No comments:

Post a Comment