Tuesday, March 15, 2016

కురిసెను హృదయములో

చిత్రం : నేను నా దేశం (1974)
సంగీతం :  సత్యం
గీతరచయిత : అంకిశ్రీ
నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల   




పల్లవి :


కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మల్లెలు...



కురిసెను కన్నులలో పూలవానలు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు...



కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు...



చరణం 1 :


పగలే వెన్నెల మయము... ఈ జగమే నందన వనము
నా తలపులు పండే.. వలపులు నిండే.. మోజులే రేపే నాలో



మనసే ప్రేమాలయము... అతి సుందర బృందావనము
తొలి చూపుల నెలము.. కలిసెను మనము.. ఆశలు రేగే నాలో..


ఓ ప్రియా.. ఆ.. ఆ..ఆ.. 


కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు...



చరణం 2 :


పెదవులలో మధురిమలు.. నీ నడకలలో మగసిరులు
అనురాగములొలికే తీయని పలుకే... విందులు చేసె నాలో


కన్నులలో నయగారం... నీ నడకలలో వయ్యారం...
ఆ నగవుల సొగసే రమ్మని పిలిచే... తొందర చేసె నాలో


ఓ చెలి... ఈ.. ఈ.. ఈ..


కురిసెను కన్నులలో పూలవానలు 

విరిసెను నాలోనే ప్రేమ మల్లెలు...




2 comments: