Thursday, March 10, 2016

లలిత కళారాధనలో

చిత్రం : కళ్యాణి (1979)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల 

పల్లవి :

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను..
ఒదిగే తొలి పువ్వును నేను..

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను...
ఒదిగే తొలి పువ్వును నేను... 

చరణం 1 :

కృతిని అమ్మని పోతన్నకు
కృతిని అమ్మని పోతన్నకు
మెతుకే కరువైపోలేదా....
బ్రతికి ఉండగా త్యాగయ్యకు
బ్రతికి ఉండగా త్యాగయ్యకు
బ్రతుకే బరువైపోలేదా...

విరిసిన కుసుమం వాడిపోతే... కరుణ చూపేదెవరు
విరిసిన కుసుమం వాడిపోతే... కరుణ చూపేదెవరు
పాడే కోకిల మూగ వోతే... పలకరించేదెవరూ
పాడే కోకిల మూగ వోతే... పలకరించేదెవరూ
కడుపునింపని కళలెందుకు?
కడుపునింపని కళలెందుకు?
తనకుమాలిన ధర్మమెందుకు...

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను...
ఒదిగే తొలి పువ్వును నేను... 

లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5338

No comments:

Post a Comment